ప్ర‌కాష్ రాజ్ తాజాగా విడుద‌ల చేసిన వీడియో పుటేజ్‌కు సంబంధించి మా ఎన్నిక‌ల అధికారి కృష్ణ‌మోహ‌న్ పూర్తిగా చేతులు ఎత్తేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వ‌లా?  వ‌ద్దా? అనేది మా అధ్య‌క్షుడిగా ఉన్న విష్ణు మాత్ర‌మే నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంద‌న్నారు. త‌న‌కు ఎటువంటి ప్ర‌మేయం లేద‌న్నారు. ఎన్నిక‌ల‌కు ముందుకానీ, ఎన్నిక‌లు జ‌రిగే స‌మ‌యంలోకానీ పుటేజ్ అడిగివుంటే తాను ఇచ్చేవాణ్ని అని, కానీ ఇప్పుడు విష్ణు అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యాక నిర్ణ‌యం ఆయ‌నదేన‌ని స్ప‌ష్టం చేశారు. కౌంటింగ్ స‌మ‌యంలోనైనా ఎవ‌రైనా ఫిర్యాదు చేసివుంటే క‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకునేవాణ్ని అని, కానీ అప్పుడు ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌లేద‌న్నారు. ఎన్నిక‌లు పూర్తిచేయ‌డంతో త‌న బాధ్య‌త ముగిసింద‌ని, ప్ర‌కాష్ రాజ్ అడుగుతున్న సీసీటీవీ పుటేజ్ కానీ, ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రుగుతున్న ప‌రిణామాలుకానీ త‌న ప‌రిధిలోకి రావ‌ని కృష్ణ‌మోహ‌న్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌కాష్ రాజ్ విడుద‌ల చేసిన సీసీటీవీ పుటేజ్ ఇప్పుడు సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. మా ఎన్నిక‌ల్లో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ జోక్యం చేసుకుంది అన‌డానికి ఇంత‌కంటే సాక్ష్యం ఏం కావాల‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa