ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం విధిత‌మే. అధికార వైసీపీ ఇప్ప‌టికే జోరుగా ప్ర‌చారం నిర్వ‌హిస్తుంది. బీజేపీ కూడ ప్ర‌చారాన్ని కొన‌సాగిస్తుంది. ఈ త‌రుణంలోనే..  ఆదినారాయ‌ణ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బ‌ద్వేల్‌లో మోడీ వ‌ర్సెస్ కేడీల మ‌ధ్యనే ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అదేవిధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్ అక్ర‌మంగా రూ.42వేల కోట్లు త‌న తండ్రి ఉన్నప్పుడే సంపాదించాడు.

ధ‌నార్జ‌నే ధ్యేయంగా జ‌గ‌న్ పాల‌న కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ చేసే ప‌లు కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌లు తెలుసుకోవాల‌ని సూచించారు. ఉపఎన్నిక‌లో ప్ర‌జలంద‌రూ పాల్గొనాల‌ని పేర్కొన్నారు. స్థానిక బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయిస్తున్నారు. ఇటీవ‌ల బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి వైసీపీ నేత‌ల‌పై, పోలీసుల‌పై ఫిర్యాదు చేశాడ‌ని గుర్తు చేశారు. అయినా వారి ఆగ‌డాలు ఆగ‌క‌పోవ‌డంతో ఇవాళ కూడ మ‌రోసారి వైసీపీ నేత‌ల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: