క్యాంపు కార్యాలయంలో వైయస్సార్‌ రైతు భరోసా, వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల నిధులను సిఎం వైఎస్ జగన్ విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నూటికి నూరుశాతం అమలు చేస్తున్నాం అని తెలిపారు. రైతు పక్షపాత ప్రభుత్వం ఇది అని పేర్కొన్నారు. ఇకేసారి మూడు పథకాలకు సంబంధించి నిధులను విడుదల చేస్తున్నాం అన్నారు జగన్.

వైయస్సార్‌ రైతు భరోసా, వైయస్సార్‌ సున్నావడ్డీ, యంత్రసేవా పథకం అని ఈ మూడు పథకాలకోసం రూ. 2190 కోట్ల లబ్ధి చేకూరుతుందని వివరించారు. కరోనా సవాల్‌ విసిరినా.. రైతు అడుగు ముందుకేస్తున్నాడు అని గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను సైతం చెల్లించుకుంటూ వస్తున్నాం అని వివరించారు. వ్యవస్థలను సరిదిద్దుతున్నాం అన్నారు జగన్. మార్కెటింగ్‌ మీద విపరీతమైన శ్రద్ధ కూడా పెట్టాం అని వివరించారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం బకాయిలను కూడా రైతులకోసంమన ప్రభుత్వం కట్టింది అని తెలిపారు. గత ప్రభుత్వం వదిలేసిన రూ.384 కోట్ల రూపాయల విత్తన బకాయిలను కూడా మనమే చెల్లించాం అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: