ఆంధ్రప్రదేశ్‌లో ఓ మహిళా రేషన్‌ డీలర్ వీరంగం సృష్టించింది.  పుట్టలో వేలు పెడితే  పాము క‌ర‌చ‌దా అన్న‌ట్టూ ఆమె చెలరేగిపోయింది. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు, పంచాయ‌తీ సెక్రటేరియట్ ఉద్యోగులకు సైతం చుక్కలు చూపించింది. తూర్పుగోదావరి జిల్లా నడురబడ గ్రామంలో రేషన్ షాపును స్వాధీనం చేసుకోవడం కోసం రామచంద్రాపురం ఆర్డీవో సింధు ప్రయత్నించారు.   డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు తో రెవెన్యూ అధికారులు, గ్రామ సచివాలయ ఉద్యోగులతో కలిసి దుకాణం స్వాధీనం  చేసుకోవ‌డం కోసం  వచ్చారు. కానీ దుకాణాన్ని స్వాధీనం చేసేందుకు మహిళా రేషన్ డీలర్ మిర్తిపాటి జ్యోతి భ‌ద్ర‌కాళిగా మారింది. ఎంత నచ్చజెప్పినా ఇచ్చేది లేదని ఎదురు దాడికి దిగింది.

చేసేది ఏమి లేక‌ ఇంటి గేట్ పగలగొట్టాలని ఆర్డీవో సింధు ఆర్డర్ ఇచ్చింది.  అది విన్న రేష‌న్ డీల‌ర్ జ్యోతి రెచ్చిపోయింది. తన ఇంటి గేట్ తీసేందుకు ప్రయత్నించిన అధికారుల కండ్ల‌లో కారం జ‌ల్లింది. అదేవిధంగా రాడ్డుతో అటాక్ చేసింది. తనకు 2025వరకు హక్కు ఉంద‌ని  జ్యోతి  వాదించింది. హైకోర్టు ఆర్డర్‌లో కూడా అదే ఉందని చెప్పుకొచ్చింది. కోర్టులో కేసు పెండింగ్ ఉండ‌గా.. త‌న‌ ఇంటిపై దౌర్జన్యం చేస్తారా? నన్ను చంపేస్తారా? అని డీలర్ జ్యోతి కౌంటర్ అటాక్ చేసింది. ఆమె అటాక్‌తో ఇద్ద‌రు మ‌హిళా పోలీసుల‌కు, ఒక స‌చివాయ ఉద్యోగికి, వాలంటీర్‌కు గాయాల‌య్యాయి. కండ్ల‌లో కారం ప‌డంతో ఇబ్బంది ప‌డ్డారు.  మ‌హిళా డీల‌ర్ దాడితో ఏమి చేయాలో అర్థంకాక అధికారులు తిక‌మ‌క‌ప‌డ్డారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: