గత కొద్ది రోజుల క్రితమే మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలలో భూ ప్రకంపనలు సృష్టించిన విషయం విధితమే. తాజాగా మళ్లీ మంచిర్యాల జిల్లాలో భూ ప్రకంపనలు టెన్షన్ రేకెత్తించాయి. దాదాపు మూడు సెకన్ల పాటు ఒక్కసారిగా భూమి కంపించినది. స్వల్ప భూ ప్రకంపనలు స్థానికులకు చెమటలు పట్టించాయి. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు. వరుసగా భూ కంపం సంభవించడంతో మంచిర్యాల, కొమురంభీమ్ జిల్లాల జనాలు భయాందోళన చెందుతున్నారు. మాగ్నిట్యూడ్ 4.3 గా నమోదు అయింది.
కొమురం భీం జిల్లా కౌటాల మండలంలో ఆదివారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించినది. దీంతో ఇండ్లలో ఉన్నటువంటి కుర్చీలు, వస్తువులు ఉన్నట్టుండి ఒక్కసారిగా కదిలిపోవడంతో జనాలు భయానికి గరై టెన్షన్ పడ్డారు. భూమి కంపించిన వెంటనే ప్రజలు ఆందోళనతో ఇండ్లలోనుంచి రోడ్డు పైకి పరుగులు తీశారు. పెంచికల్‌పేట మండలంలోని మెట్లగూడ, బొంబాయిగూడ, జిల్లెడ, ముర్లిగూడ తదితర గ్రామాలలో 7 గంటల సమయంలో 3 సెకన్ల పాటు భూమి కంపించింది. అదేవిధంగా బెజ్జూరు మండలంలోని బెజ్జూరు, సుశ్మీర్, అందుగులగూడ, డబ్బాగూడ, సలుగుపల్లి, కుశ్నపల్లి, హేటిగూడ, నాగుల్వాయి, బారేగూడ, పాపన్‌పేట, కుకుడ ప్రాంతాలలో కూడ 2 సెకన్ల పాటు భూ ప్రకంపనలు సృష్టించాయి. దీంతో ఆ రెండు జిల్లాలు భూకంపంతో గజగజ వణికిపోతున్నాయి. ఎప్పుడు ఏమవుతుందోననే టెన్షన్ కూడ పడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి