ఇటీవ‌ల త‌మిళ హీరో సూర్య న‌టించిన ఆకాశ‌మే నీ హ‌ద్దురా, జైభీమ్ వంటి చిత్రాలు ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో విడుద‌ల‌య్యాయ‌ని నిరాశ చెందిన అభిమానుల‌కు ఈసారి శుభ‌వార్త అనే చెప్పాలి. పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో  రూపొందించిన తాజా చిత్రం ఎదర్కుమ్‌ తునిందవన్ తెలుగులో దేనికైనా తెగించేవాడుగా   సూర్య హీరోగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. అయితే ఈ సినిమా మాత్రం  గ‌త రెండు సినిమాల మాదిరిగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కాకుండా థియేటర్స్‌లోనే విడుద‌ల‌వ్వ‌నుంది.

 కళానిధి మార‌న్ నిర్మించిన దేనికైన తెగించేవాడు 2022 ఫిబ్ర‌వ‌రి 4న థియేట‌ర్ల‌లోకి రానున్న‌ది. ఇందులో ప్రియాంకా అరుల్ మోహ‌న‌న్‌, విన‌య్ రాయ్‌, స‌త్య‌రాజ్‌, శ‌ర‌ణ్య‌, సూరిలు  ప్ర‌ధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి డి.ఇమ్మాన్ స్వ‌ర‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న‌ది. సూర్య చేసిన ఢ్యాన్స్ చాలా బాగుంద‌ని అభిమానులు పేర్కొంటున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన సూర్య జై భీమ్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న విష‌యం విధిత‌మే. జైభీమ్ సినిమా చాలా బాగుంద‌ని తెలంగాణ ఎమ్మెల్యే సీతక్క సైతం హీరో సూర్య‌కు అభినంద‌న‌లు తెలిపారు. థియేట‌ర్‌లో విడుద‌ల‌య్యే ఈ సినిమా ఎలా ఉండ‌నున్న‌దో తెలియాలంటే ఫిబ్ర‌వ‌రి 4 వ‌ర‌కు వేచి చూడాలి మ‌రి.



మరింత సమాచారం తెలుసుకోండి: