ఏజెన్సీ వాసుల‌కు పులి భ‌యం మాత్రం వీడ‌డం లేదు. మూడు వారాలుగా ములుగు, మ‌హ‌బూబాబాద్ అడ‌వుల‌లో పులి సంచారం క‌ల‌క‌లం రేకేత్తిస్తున్న‌ది. పదుల సంఖ్యలో పశువులను పులి హతం చేస్తునే ఉంది. పలువురు పశువుల కాపరులపై దాడికి కూడా యత్నించింది పులి.  ఇంత తంతు జరుగుతున్పప్పటికీ అధికారులు మాత్రం  అప్రమత్తంగా ఉండాలని సూచించి వదిలేస్తున్న పరిస్థితి దాపురించింది.  పులిని బంధించడానికి  అధికారులు  ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆదివాసి గూడాలు భయం గుప్పిట్లో ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు.

ముఖ్యంగా మ‌హ‌బూబాబాద్ జిల్లాలో పులి హ‌ల్ చ‌ల్ చేసి.. గూడూరు- కొత్త‌గూడ ఆవుల మంద‌పై పెద్ద‌పులి దాడి చేయ‌డంతో రెండు ఆవులు మృతి చెందాయి. దీంతో ఆవుల గుంపు చెల్ల‌చెదురైపోయింది. అటవీ గ్రామాల ప్ర‌జ‌లు పులి ఎప్పుడు ఎక్క‌డి నుంచి వ‌చ్చి దాడి చేస్తుందోన‌ని భ‌యంగా గ‌డుపుతున్నారు. ముఖ్యంగా గూడురు మండ‌లం నేల‌వంచ‌, కార్లాయి గ్రామాల మ‌ధ్య అట‌వీ ప్రాంతంలో ఆవుల మంద మేత‌కు వెళ్లిన‌ది. ఈ మంద‌పై ఒక్క‌సారిగా పులి దాడి చేయ‌డంతో రెండు ఆవులు మృతి చెంద‌డంతో స్థానికుల్లో భ‌యంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్ప‌టికే అధికారులు పులి కోసం మూడు బృందాలుగా గాలింపులు చేప‌డుతున్న‌ట్టు వెల్ల‌డించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: