న‌వంబ‌ర్ 29 నుంచి లోక్‌స‌భ శీతాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్న త‌రుణంలో.. రేపు టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం కానున్న‌ది.  ముఖ్యంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ఎంపీల‌తో స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశంలో పార్లమెంట్‌లో అనుస‌రించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ ఎంపీల‌కు దిశానిర్దేశం చేస్తారు.

తెలంగాణ‌లో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితులు, కేంద్రంపై సీఎం చేస్తున్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఎంపీలు ఏవిధంగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. వ్యూహాలు ఎలా ఉండ‌బోతున్నాయ‌నే అంశంపై ఆస‌క్తిక‌రంగా మారిన‌ది. ధాన్యం కొనుగోలు అశం, వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు, విద్యుత్ స‌వ‌ర‌ణ బిల్లుల లాంటివి పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ఎంపీల‌కు సీఎం సూచించ‌నున్నారు.  

కేంద్ర మంత్రి ఇచ్చిన వివ‌ర‌ణ‌కు.. రాష్ట్ర నేత‌ల వ్యాఖ్య‌ల‌కు పొంత‌న కుద‌క‌పోవ‌డంతో పార్ల‌మెంట్ వేదిక‌గానే స్ప‌ష్ట‌త తెచ్చుకోవాల‌ని గులాబీ ఎంపీల‌కు సీఎం కేసీఆర్  సూచించ‌నున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్ సైతం.. రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాలు కుమ్మ‌క్కై రైతుల‌ను అయోమ‌యంలో ప‌డేస్తున్నార‌నే విష‌యాన్ని పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టం చేయాల‌నే యోచ‌న‌లో వ్యూహాలు ర‌చిస్తున్న‌ట్టు తెలుస్తున్న‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: