ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో వార్డు, గ్రామ సచివాలయాలకు స్టేషనరీ కిట్స్ సరఫరా చేసినా.. బిల్లులు చెల్లించలేదు అని హైకోర్టులో పిటీషన్ దాఖ‌లైంది. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టు కు రావాలని హైకోర్టు ఆదేశం జారీ చేసింది. పిటిష‌న్ ను నేష‌న‌ల్ కో ఆప‌రేటివ్ కన్జూమ‌ర్ ఫెడ‌రేష‌న్ పిటీష‌న్ దాఖ‌లు చేసిన‌ది. ఫెడ‌రేష‌న్ త‌రుపున పిటీష‌న్‌ను న్యాయ‌వాది తేజ వేసారు.

2019లోనే బిల్లులు అందించిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టివ‌ర‌కు బిల్లులను ప్ర‌భుత్వం చెల్లించ‌లేదు అని.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం తీరుపై హై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నిన్న వాద‌న‌లు జ‌రిపిన అనంత‌రం మంగ‌ళ‌వారం కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించిన హై కోర్టు ఇవాళ స‌మాధానం లేక‌పోవ‌డంతో కోర్టు సీరియ‌స్ అయిన‌ది. డిసెంబ‌ర్ 13, 2021 తేదీ  వ‌ర‌కు ఫైనాన్స్ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ హై కోర్టు ముందు హాజ‌రై వివర‌ణ ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది. ఫైనాన్స్ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ హాజ‌రు కావాల‌ని కోర్టు ఆదేశించ‌డంతో  ప్ర‌భుత్వం ఇప్ప‌టికే బిల్లుల‌ను చెల్లించేందుకు సిద్ధం అవుతున్న‌ట్టు స‌మాచారం. ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ ఏమి స‌మాధానం చెబుతారో వేచి చూడాలి మ‌రీ.


మరింత సమాచారం తెలుసుకోండి: