ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆర్థిక శాఖ ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కూడా స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ముఖ్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సంబంధించిన వేత‌న స‌వ‌ర‌ణ‌పై సీఎం చ‌ర్చిస్తున్నారు. ఉద్యోగుల  వేతన సవరణపై  కమిటీ ఇచ్చిన నివేదికపై ముఖ్య‌మంత్రి ఆర్థిక నిపుణుల‌తో చ‌ర్చ‌లు ప్రారంభించారు.

క‌మిష‌న్ సిఫారసుల‌ను ప‌రిశీలించి ఎంత మేర‌కు వేత‌నాలు పెంచాల‌ని అంశంపై నిపుణుల‌తో క్లారిటీ తీసుకోనున్నారు సీఎం. అదేవిధంగా ఉద్యోగుల‌కు సంబంధించి మిగిలిన స‌మ‌స్య‌ల‌పై కూడా చ‌ర్చిస్తున్నారు. సీపీఎస్ ర‌ద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల స‌ర్వీసుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ త‌దిత‌ర డిమాండ్ల‌పై కూడా చ‌ర్చ‌లు జ‌రుపుతున్న సీఎం జ‌గ‌న్‌. ఇదిలా ఉండ‌గా.. డిసెంబ‌ర్ 3న తిరుపతిలో  సీఎం జ‌గ‌న్ ప‌ది రోజుల్లోనే పీఆర్సీ ప్ర‌క‌టిస్తామ‌ని ఉద్యోగుల‌కు హామీ ఇచ్చారు. ప్ర‌స్తుతం జ‌రిగే స‌మావేశంలో  ట్ మెంట్ ను ఖరారు చేసే అవకాశం క‌నిపిస్తోంది. గ్రామ వార్డ్ సచివాలయాల ఉద్యోగులకు ప్రొహిబిషన్ ఖరారు అంశంపై కూడా చ‌ర్చ‌లు జ‌రుప‌నున్నారు సీఎం జ‌గ‌న్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: