తెలంగాణ రాష్ట్రంలో వరస విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. బుధవారం వేర్వేరు ఘటనల్లో ఇప్పటి వరకూ ఐదుగురు మృత్యువాత పడ్డారు. అటో ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.  మరో ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు  ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడంటే ?
నిర్మల్ జిల్లా పరిధిలోని కడెం మండలం నుంచి  బెల్లాల్ గ్రామ సరిహద్దుల్లోకి వస్తున్న ఆటో అదుపుతప్పి  పక్కనే ఉన్న పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు మల్లన పేటకు చెందిన మల్లయ్య, బెల్లాల్ కు చెందిన శాంత,  అన్నాపూర్ కు చెందన శంకర్ గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే విదంగా ఖమ్మం జిల్లా బ్రాహహ్మణ బజారుకు సమీపంలోని ఖాళీ స్థలంలో చిన్నారులు ఆడుకుంటున్నారు. బలంగా గాలి వీచడంతో చెట్టుకొమ్మ విరిగి పక్కనే ఉన్న మట్టిగోడపై పడింది. దీంతో గోడ కూలి పోయింది. ఈ ఘటనలో గోడ అంచున ఆడుకుంటూ ఉండిన ఇద్దరు చిన్నారులు  మట్టి పెళ్లలు పైన పడి మరణించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: