నిజామాబాద్‌, కామారెడ్డి స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌మాణ స్వీకారం చేసారు. బుధ‌వారం శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ చాంబ‌ర్‌లో ప్రొటెం చైర్మ‌న్ అమిణుల్ హాస‌న్ జాఫ్రి.. క‌విత చే  ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఈ సంద‌ర్బంగా మండ‌లి రూల్స్ బుక్స్‌, ఐడీ కార్డుల‌ను అందించిన మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి శుభాకాంక్ష‌లు క‌విత‌కు  తెలియ‌జేసారు.

ఎమ్మెల్సీగా క‌విత‌తో పాటు కూచుకుల్ల  దామోద‌ర్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీగా ప్ర‌మాణం చేసారు. శాస‌న మండ‌లి ప్రొటెం చైర్మ‌న్ హ‌స‌న్ జాఫ్రి వీరితో తెలంగాణ మండ‌లి చైర్మ‌న్ ఛాంబ‌ర్‌లో  ఇవాళ‌ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. శాస‌న స‌భ వ్య‌వ‌హారాల మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి హాజ‌రై.. నూత‌నంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ క‌విత‌, దామోద‌ర్‌రెడ్డిల‌కు మంత్రి రూల్స్ బుక్స్‌, ఐడీకార్డుల‌ను అందించారు. ఆ త‌రువాత పుష్ప‌గుచ్చం అంద‌జేసి వారిద్ద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు మంత్రి.


మరింత సమాచారం తెలుసుకోండి: