ఉద్యోగ సంఘాల నేతలు, ప్రభుత్వం మధ్య ఏకాభిప్రాయం కుదిరిన సమయంలో వాతావరణం తేలికపడింది. మొన్నటి ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రత్యేకించి చలో విజయవాడ సమయంలో ఉద్యోగులు కొందరు సంయమనం కోల్పోయి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మరికొందరు విచిత్ర వేషధారణలతో నిరసన తెలిపారు.


ఆ సమయంలోనే మీడియా మైకులు కనిపించగానే ఉద్యోగులు రెచ్చిపోయారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇప్పుడు రెండు వర్గాలు కూర్చుని సమస్యను పరిష్కరించుకున్నాయి. కొన్ని డిమాండ్ల విషయంలో ప్రభుత్వం కూడా తగ్గింది. అందుకే ఇప్పుడు ఇరు వర్గాలు సారీలు చెప్పుకుంటున్నాయి. తమ కంటే ఎక్కువగా సీఎం జగన్ పై ఉద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారని.. మెరుగైన పీఆర్సీ ఇస్తారనే ఆశతో ఇంతకాలం ఎదురుచూశారని.. ప్రభుత్వం అన్యాయం చేస్తుందనే చలో విజయవాడ కార్యక్రమంలో సీఎం పై చిన్న చిన్న మాటలు అనేశారని.. వాటిని మనసులో పెట్టుకోవద్దని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు అన్నారు. అన్యదా భావించవద్దని విజ్ఞప్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: