ఈ నెల 27న అమ్మఒడి పథకం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల అమ్మఒడి కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.6,500 కోట్లు కేటాయించింది. అయితే.. కొందరికి మాత్రం అమ్మఒడి పథకం రాదట. ఈ ఏడాది దాదాపు  లక్ష మందికి అమ్మ ఒడి పథకం నుంచి కోత విధించినట్టు తెలుస్తోంది. అందులో పాఠశాలలకు గైర్హాజరు కావటంతో 51 వేల మందికి అమ్మఒడి పథకానికి అనర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది.


ఇక మిగిలిన 50 వేల మందిపైచిలుకు విద్యార్ధులకూ వేర్వేరు కారణాలతో పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అంతే కాదు.. ఈ ఏడాది 13 వేల రూపాయలను మాత్రమే ప్రభుత్వం జమ చేయబోతోంది. 2021-22లోనూ 6107 కోట్ల రూపాయలను బడ్జెట్ లో పెట్టినా అమ్మఒడిని ప్రభుత్వం అమలు చేయలేదు. మొదటి రెండు సంవత్సరాలూ 44,48,865 మంది లబ్దిదారుల ఖాతాల్లో నిధుల్ని జమ చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: