నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది.  దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి బంపర్ మెజారిటీతో గెలిచారు. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి వైసీపీ అభ్యర్థిదే పైచేయి.. వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన మేకపాటి విక్రమ్‌ రెడ్డికి ఎదురే లేకుండా పోయింది. ఆయన ప్రతి రౌండ్‌లోనూ పూర్తి స్థాయి ఆధిపత్యం కనబరిచారు.

మొత్తంగా 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రతి రౌండ్‌లోనూ విక్రమ్‌ రెడ్డి లీడింగ్‌లో ఉన్నారు. ఆత్మకూరులో మొత్తం ఓట్లు 2,13,338. 23న జరిగిన పోలింగ్‌లో ఓటేసింది 1,37,081 మంది. విక్రమ్‌ రెడ్డి 15 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 76,096 ఓట్లు వచ్చాయి. అంటే పోలైన మొత్తం ఓట్లలో 50 శాతానికిపైగా వచ్చాయి. చివరకు 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత  అభ్యర్థి విక్రమ్‌రెడ్డి 1,02,074 ఓట్లు దక్కించుకున్నారు. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌ యాదవ్‌పై 82,742 ఓట్ల మెజారిటీతో విక్రమ్‌రెడ్డి గెలిచారు. బీజేపీ అభ్యర్థికి 19,332 ఓట్లు వచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: