గుమ్మడి కాయ ఎంత ధర ఉంటుంది.. మహా ఉంటే.. యాభై రూపాయలు.. ఇంకా పెద్దదైతే.. వంద రూపాయులు.. ఇంకా స్పెషల్ అంటే.. 200 లేదా 300 రూపాయలు.. కానీ.. ఆ గుమ్మడి కాయ మాత్రం ఏకంగా రూ. 50 వేల రూపాయల ధర పలికింది. మరి ఏంటా ఐదు కేజీల గుమ్మడి కాయ ప్రత్యేకత అనుకుంటున్నారా..

మన దగ్గర వినాయక విగ్రహాల వద్ద లడ్డూను వేలం వేస్తారు కదా.. ఈ లడ్డు కొనుక్కుంటే శుభం కలుగుతుందని నమ్మకం కదా. అదే తరహాలో కేరళలో ఓనం పండుగ సందర్భంగా గుమ్మడి కాయను వేలం వేస్తారు. వాటికి మంచి ధర వస్తుంది. తాజాగా ఇడుక్కిలో 5 కిలోలున్న గుమ్మడి కాయను ఓ  వ్యక్తి 50 వేల రూపాయలకు కొనుగోలు చేశాడు. ఓనం పండగ సమయంలో నిర్వహించే వేలంలో పొట్టేలు, కోళ్లకు కూడా మంచి ధర వస్తుంది. కానీ ఈ సారి గుమ్మడికాయకు కూడా ఇంత రేటు పలకడం మాత్రం విశేషమే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: