టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు.. ఆరోగ్య మంత్రి విడదల రజనిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆయన కొనసాగించాలంటూ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఇదే సమయంలో ఆరోగ్య మంత్రి విడదల రజనిపై విరుచుకుపడ్డారు. ఊసరవెల్లిలా ప్రవర్తించే మంత్రి విడదల రజిని సీఎం పక్కన కూర్చోవడానిక సిగ్గుపడాలని  మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు  విమర్శించారు.


మంత్రి విడదల రజిని చేసిందే అసలైన వెన్నుపోటని  మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు  అన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో ఉండి మహానాడులో చంద్రబాబు నాటిన మొక్కనంటూ చెప్పుకుని... అప్పటి ప్రతిపక్ష నేత జగన్ రాక్షసుడంటూ మాట్లాడి.. ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయించారని  మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు  గుర్తు చేశారు. విడదల రజని ఎన్నికల ముందు జగన్ పార్టీలో చేరడం అసలైన వెన్నుపోటని  మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు  విమర్శించారు. అలాంటి వ్యక్తులకు ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబం గురించి మాట్లాడే అర్హతలేదని  మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: