తెలంగాణలో గొల్ల, కురుమ, యాదవులకు గుడ్ న్యూస్‌ అని చెప్పొచ్చు.. ఎందుకంటే.. ఈ నెల 9 నుండి గొర్రెల పంపిణీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. నకిరేకల్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌  గొర్రెల పంపిణీ ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్ సచివాలయంలో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు.


గొర్రెల యూనిట్ల పంపిణీ, ఫిష్ ఫుడ్ ఫెస్టివల్, దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్షించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.. గొర్రెల అభివృద్ధి పథకం, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాల బ్రోచర్లను స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా తో కలిసి ఆవిష్కరించారు. 8వ తేదీన హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను కూడా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించనున్నారు. దశాబ్ది ఉత్సవాలలో ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించాలన్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.. గొర్రెల యూనిట్ల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr