భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడి మార్పు రాజకీయంగా కలకలం సృష్టించింది. అయితే దీనిపై కాంగ్రెస్‌ పార్టీ పలు సందేహాలు వ్యక్తం చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మార్పు అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. అయినప్పటికీ అందులో ప్రజాప్రయోజనాలు దాగి ఉన్నందున ఆ పార్టీ అధిష్ఠానం సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ డిమాండ్‌ చేస్తున్నారు.


బండి సంజయ్‌ను తప్పించి జి. కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా చేయడంలో మరో కోణమేదైనా ఉందా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించడం ద్వారా కేసీఆర్‌తో సౌమ్యంగా ఉండి సఖ్యత నెరపడానికా  అని నిలదీశారు. నామినేషన్ వేసిన బండి సంజయ్‌ పత్రికలకు వందల కోట్ల ప్రకటనలు ఎలా ఇచ్చారని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నిరంజన్‌ రెడ్డి విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp