కేసీఆర్‌ తొమ్మిదిన్నరేళ్ల పాలనకు తెర పడబోతోందా.. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందా..అంటే అవునంటున్నాయి ఎగ్జిట్‌పోల్స్.. ఎగ్జిట్‌ పోల్స్ మాత్రమే కాదు. అనేక మంది అనలిస్టులు కూడా అదే చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించబోతోంది. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 64 నుంచి 70 సీట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. బిఆర్ఎస్ పార్టీకి 33 - 41 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఎం ఐ ఎం పార్టీకి 6-7 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక బీజేపీ 3 నుంచి 6 సీట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది.


దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ కారు పార్టీకి పరాభవం తప్పదనే తేలింది. బిఆర్ఎస్ ప్రభుత్వంపై తిరగబడ్డ యువత, రైతులు ఆగ్రహంగా ఉన్నారని పలు సర్వేలు చెప్పాయి. పట్టణ ప్రాంతాల్లో బలంగానే ఉన్న బి.ఆర్.ఎస్... పల్లెల్లో మాత్రం అంతగా ఆకట్టుకోలేదని తెలుస్తోంది. కేసీఆర్ ఫ్యామిలీ కంటే స్థానిక నాయకత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని.. పదేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. అందుకే మార్పువైపు తెలంగాణ ప్రజానీకం ఆకర్షితులయ్యారని తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: