ప్రపంచంలో భారతదేశం బలీయమైన ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందుతోంది. అత్యధిక జిడిపి కలిగిన దేశాలలో 10వ స్థానంలో ఉన్న భారత్‌ పదేళ్ళ వ్యవధిలో 5వ స్థానానికి చేరింది. వచ్చే అయిదేళ్ళలో భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌ను అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు యావత్తు మందకొడిగా సాగుతున్న నేపధ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా ముందుకు పోతోంది.గత ఏడాది మన జిడిపి భారీగా పెరిగి 7.2 శాతంగా నమోదైందని లెక్కలు చెబుతున్నాయి.


ఆవిర్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థలతో పోల్చుకుంటే ఇది రెండు రెట్లు ఎక్కువగా తెలుస్తోంది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్లో దేశ జిడిపి 7.6 శాతం వృద్ధితో మార్కెట్ అంచనాలను మించిపోయింది. పన్నుల వసూళ్ళలో సాధిస్తున్న గణనీయమైన వృద్ధి భారత్ ఆర్థిక పురోగతికి ఇంధనంలా చెప్పుకొవచ్చు. పదేళ్ళలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు 160 శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: