ఏపీ నిరుద్యోగులకు ఇది నిజంగా గుడ్‌న్యూస్‌.. ఏపీ సర్కారు గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 897 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. మరో 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఈనెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 న గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది.


నూతన సిలబస్ ప్రకారమే గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. డిగ్రీ, ఆపై విద్యార్హత కల్గిన వారు గ్రూప్ 2 ఉద్యోగాలకు అర్హులని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇప్పటికే ఏపీ క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్లు మూడు పూర్తి చేసింది. మరో నోటిఫికేషన్ వేసేందుకు సిద్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: