ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు జోరు పెంచారు. యువత పొట్ట కొట్టిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని మండిపడుతున్నారు. సీఎం జగన్‌ను చంద్రబాబు రోజుకో కొత్త సంబోధనతో పిలుస్తున్నారు. తాజాగా నార్త్ కొరియాలో కిమ్ కాదు .. ఆయన సోదరుడు కిమ్ జగన్ మోహన్ రెడ్డి అంటూ కామెంట్ చేశారు. జగన్ ఎవరూ సంతోషంగా ఉంటే ఓర్వలేడు.. అందరినీ భయపెట్టడం, అందరినీ ఇబ్బందులు పెట్టడం చేస్తున్నాడు.. డబ్బు ఉన్న వాడికి, ఊడిగం చేసే వాడికి వైసీపీ టుకెట్లు ఇస్తుంది.. నేను మాత్రం ఒక సాధారణ వ్యక్తికి, సేవా చేసే వ్యక్తికి టికెట్ ఇస్తున్నా అంటున్నారు చంద్రబాబు. విజయనగరంలో బొత్స కుటుంబం ఉత్తరాంధ్ర దోచేసిందని.. అయినా ఎమ్మెల్యే టికెట్లు వాళ్ళకే...ఎంపి టికెట్ల వాళ్ళకే జగన్ ఇస్తున్నాడని చంద్రబాబు అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే స్వామి ఉన్నాడు...బొత్స దోచుకున్నది ఏమైనా మిగిలింది ఉంటే ...ఆ మిగిలింది ఈయన దోచుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: