బంగారంపై 75 శాతం పన్ను వేస్తారు, సెస్సు, 10 శాతం జరిమానా విధిస్తారు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో చాలామంది బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు. ఉన్న బంగారాన్ని ఏం చేయాలా అని తలలు పట్టుకుంటున్నారు. కానీ బంగారం పోతుందేమోనన్న బెంగ అసలు అవసరమే లేదు. వారసత్వంగా వచ్చిన ఇంట్లోని పాత బంగారంపై పన్ను వేయడం లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్ సభలో ఆమోదం పొంది, ప్రస్తుతం రాజ్యసభ పరిశీలనలో ఉన్న పన్ను చట్టాల బిల్లు2016 ప్రకారం వారసత్వంగా వచ్చిన పాత బంగారం సహా