తాజాగా దేశవ్యాప్తంగా ఉల్లి  కొరత సమస్య చాల ఎక్కువ అయిన సంగతి అందరికీ తెలిసిందే కదా. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో దొంగలు తెలివిగా వ్యవహరించడం మొదలుపెట్టారు. దీంతో ప్రజలు ఉల్లిపాయాలు కొనాలంటేనే గొల్లుమనే పరిస్థితి రావడం జరిగింది. అర్థరాత్రి ఓ షాపులో చోరీకి పాల్పడిన దొంగలు బాక్స్ లోని నగదును పట్టించుకోకుండా.. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి బస్తాలను ఎత్తుకొని వెళ్ళిపోయారు.  ఈ సంఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో సుతహత ప్రాంతంలో చోటు చేసుకోవడం జరిగింది .

 

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే  అక్షయ్‌ దాస్‌ అనే వ్యక్తి కూరగాయాల దుకాణం నిర్వహిస్తున్నాడు. తాజాగా ఉల్లిధరలు భగ్గుమంటుండటంతో ఎక్కువ దిగుమతి చేసుకుని నిల్వ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా  ఆయన షాపులో ఉల్లిపాయ బస్తాలు, వెల్లుల్లి, అల్లం బస్తాలు మాటు మాయమయ్యాయి. అక్షయ్‌ దాస్‌  షాపు తెరచి చూసి అక్షయ్ దాస్ కు వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడం గమనించాడు. 

 

దీంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి క్యాష్‌ బాక్స్‌ దగ్గరికి వెళ్లి చూడగా అందులో నగదు మొత్తం ఏమీ కాకుండా అలాగే ఉంది. కానీ ఉల్లిపాయల బస్తాలు చోరీకి గురి అయ్యాయి. ఈ సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఈ ఘటనలో ఐదు క్వింటాళ్లకు పైగా ఉల్లిపాయలను ఎత్తుక పోవడం జరిగింది అని అక్షయ్‌ దాస్‌ తెలియచేస్తునాడు.

 

ఇంకా ఉల్లి కొరత ఎప్పటి వరకు కొనసాగుతుందో అనేది అర్థం కావట్లేదని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఆంధ్ర మరియు తెలంగాణలో కొన్ని చోట్ల అధికారులు తక్కువ ధరకు అమ్మడం కూడా కొనసాగుతోంది. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం మీద కొంచెం భారం పడుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: