పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. రోజు రోజుకు తగ్గుతూ వస్తున్న ఈ పెట్రోల్, డీజిల్ ధరలు నేడు మరింత తగ్గాయి. దాదాపు 82 రూపాయిల వరుకు వెళ్లిన పెట్రోల్, డీజిల్ ధర ఇప్పుడు భారీగా తగ్గింది. ఎప్పుడు తగ్గని విధంగా నెల రోజుల నుండి బ్రేక్ లేకుండా తగ్గుతూ వస్తున్నాయి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు. 

 

అయితే ఈ నేపథ్యంలోనే నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. ఎంత తగ్గాయి అని అనుకుంటున్నారా? నేడు బుధవారం వివిధ మెట్రో నగర్లో పెట్రోల్ ధర లీటర్ కు 6 పైసల చొప్పున తగ్గగా... డీజిల్ ధర 5 పైసలు తగ్గింది. హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ 6 పైసలు తగ్గుదలతో రూ. 77.64కు చేరగా, డీజల్ ధర 9 పైసలు తగ్గుదలతో 72.02 రూపాయలకు చేరింది.

 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కాగా పెట్రోల్, డీజిల్ ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా అయితే పెరిగాయో.. అలాగే తగ్గుతూ వస్తున్నాయి. ఇది వాహనదారులకు మంచి వార్త అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: