టాటా మోటార్స్ లగ్జరీ కార్ బ్రాండ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ సెక్టార్లో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. 525 హార్స్ పవర్ శక్తిని జనరేట్ చేసే సూపర్‌చార్జ్డ్ వి8 ఇంజన్‌తో అందుబాటులోకి వ‌చ్చింది.  అడ్వెంచర్ సిరీస్‌లో టాప్-ఆఫ్ ది లైన్ వేరియంట్‌గా ఈ ఎస్‌యూవీ 90 (3-డోర్) మరియు 110 (5-డోర్) వెర్షన్లలో ల‌భ్య‌మ‌వుతోంది. 5.0 లీటర్ వి8 ఇంజన్‌తో కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిఫెండర్ వి8 ఎస్‌యూవీని తయారు చేశారు.

క‌ఠినమైన మలుపుల్లో సైతం సులువుగా ప్రయాణించేందుకు వీలుగా డిజైన్ చేసిన ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ రియర్ డిఫరెన్షియల్ వంటి మార్పులున్నాయి. ఈ కారులో కొత్తగా జోడించిన ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ రియర్ డిఫరెన్షియల్ ఫీచర్ కారణంగా వెనుక యాక్సిల్ మంచి పనితీరును చూపుతుంది. అలాగే, ఇందులోని సస్పెన్షన్ సెటప్‌ను మరింత ధృడంగా చేసి, రీకాలిబ్రేట్ చేశారు. యాంటీ-రోల్ బార్ల పరిమాణాన్ని మార్చ‌డంతోపాటు బ్రేక్‌లను కూడా ఈ వేరియంట్ కోసం విస్తరించారు.

దీని ఇంజన్ సామ‌ర్థ్యం గ‌రిష్టంగా 525 హెచ్‌పి పవర్‌ను మరియు 625 ఎన్‌ఎమ్ టార్క్‌ను పంపిణీ చేస్తుంది.  8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. 100 కిమీ వేగాన్ని చేరుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు. డిఫెండర్ సిరీస్‌లోనే ఇది అత్యంత వేగవంతమైన మోడల్. ఈ పవర్‌ను హ్యాండిల్ చేయటం కోసం కంపెనీ దీని 4×4 సిస్టమ్‌లో స్వల్ప మార్పులు చేసింది. ఇందులో ప్రత్యేకంగా కాలిబ్రేట్ చేసిన స్ప్రింగ్‌లు మరియు డాంపర్లు, పెద్ద యాంటీ-రోల్ బార్‌లు ఉన్నాయి. కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిఫెండర్ వి8 మోడల్‌ను కార్పాతియన్ ఎడిషన్ అనే ప్రత్యేక సిరీస్‌తో విక్రయించనున్నారు. ఇది కార్పాతియన్ గ్రే అని పిలువబడే ప్రత్యేకమైన బాడీ కలర్‌ను కలిగి ఉంటుంది. ఈ మోడ‌ల్ ఎప్పుడు అందుబాటులోకి రానుంద‌నే విష‌యం కంపెనీ ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. ప్ర‌క‌ట‌న కోసం అభిమానులంతా వేయిక‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: