ఐపీవోకు అడ్డుకట్ట
జాక్‌మాపై ప్రతీకార చర్యలు ఆరంభించిన డ్రాగన్ సర్కారు.. తొలుత యాంట్‌గ్రూప్ ఐపీవోను అడ్డుకుంది. గుత్తాధిపత్యం కోసం నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఈ ప్రపంచ దిగ్గజ ఇ-కామర్స్ సంస్థపై ఏకంగా 2.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. అలీబాబా గ్రూప్ ఇతర సంస్థల నుంచి తనకు పోటీ లేకుండా చేసుకునేందుకు అనేక వ్యూహాలు రచిస్తోందని చైనా మార్కెట్ రెగ్యులేషన్ ఆరోపించింది. గుత్తాధిపత్య వ్యతిరేక చర్యల్లో భాగంగా ఆ సంస్థపై 18.3 బిలియన్ యువాన్ల(2.8బిలియన్ డాలర్లు) జరిమానా విధించింది.
అలీబాబాను పక్కన పెట్టిన చైనా
చైనా విడుదల చేసిన టెక్ దిగ్గజాల జాబితా నుంచి కూడా ఆయనను పక్కనబెట్టేసింది. ఈ పరిణామాల తర్వాత జాక్ మా కొన్నాళ్ల పాటు బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయారు. దీంతో ఆయన అదృశ్యంపై పలు అనుమానాలు తలెత్తాయి. కానీ, కొద్ది వారాల తర్వాత వర్చువల్‌గా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. అలాగే చైనా కుబేరుల జాబితాలో తొలి స్థానాన్ని కూడా కోల్పోయారు. అలీబాబాపై చైనా బ్యాంకింగ్ రెగ్యులేషన్ నిబంధనలు రుద్దింది. ఫలితంగా స్టాక్ మార్కెట్లో కంపెనీ విలువ అమాంతం పడిపోయింది. అటు జాక్‌మా కుబేరుల అగ్రస్థానాన్నీ కోల్పోవాల్సి రావడమేగాక, బాహ్య ప్రపంచానికి కన్పించలేని పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు ఏకంగా నియంత్రణ పేరుతో జరిమానా రూపంలో అలీబాబాపై భారీ భారాన్నే మోపింది చైనా. ఈ జరిమానా విలువ 2019లో కంపెనీ జరిపిన మొత్తం విక్రయాల్లో(455.712 బిలియన్ యువాన్లు) దాదాపు 4 శాతానికి సమానం కావడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి