మీరు రిస్క్ తీసుకోవాలని భావిస్తున్నారా?. 10 వేల రూపాయలు పెట్టుబడిగా పెడితే... ఏడాదిలోనే 16 లక్షల రూపాయలు వస్తాయి. ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా! అయితే ఈ ఆర్టికల్ ను చదవండి... ప్రపంచంలో నివసించే ప్రతి వ్యక్తి డబ్బు కోసమే అని చాలా సందర్బాల్లో చాలా మంది చెబుతారు. కూటి కోసమే కోటి విద్యలు అనే సామెత కూడా ఉంది. అయితే చాలా సందర్భాల్లో మనం పెట్టుబడులు పెట్టిన రంగాల్లో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా వస్తాయి. కొన్ని రోజులు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే లాభాలు అదిరిపోతాయని అనుకునేవారు. కానీ ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు ఆకాశానికంటేలా లాభాలు తీసుకువస్తాయని నమ్ముతున్నారు. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టిన వారికి కళ్లుచెదిరేలా లాభాలు వచ్చాయి. ఎంతలా అంటే 10 వేల రూపాయల పెట్టుబడి పెట్టిన వారికి ఏడాదిలోనే 16 లక్షల లాభాలు కనిపించాయి. ఈ ఏడాది కాలంలో క్రిప్టో కరెన్సీ పెద్ద మొత్తంలో కళ్లు చెదిరిపోయే రాబడిని అందించింది.



కేవలం క్రిప్టో కరెన్సీ మాత్రమే కాకుండా ... చిల్జ్ అనే డిజిటల్ కరెన్సీ కూడా ఇన్వెస్టర్లకు దిమ్మ తిరిగేలా, భారీ లాభాలు సాధించి పెట్టింది. ఈ కరెన్సీలో ఇన్వెస్ట్ చేసిన వారు ఏడాదిలో 2170 శాతం రాబడిని సాధించారు. అంటే మన దేశ లెక్కల ప్రకారం... ఏడాది కాలం కిందట... డిజిటల్ కరెన్సీ చిల్జ్ లో 10 వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన వారు ప్రస్తుతం రెండు లక్షలకు పైగా ఆర్జించారు.


కానీ మరో విషయం ఏంటంటే... ఈ క్రిప్టో కరెన్సీకి ఏదేశ బ్యాంకులు గ్యారంటీని ఇవ్వలేవు. ప్రస్తుతం లాభాల్లో ఉంది కదా అని పెట్టుబడులు పెడితే తర్వాత అనుకోని విధంగా నష్టాలు కూడా వస్తాయట. అందుకే వెనుకా ముందు చూసుకుని ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: