దేశంలోకి అమెజాన్ రావడంతో చిన్న వ్యాపారుల గతి పూర్తిగా చెడింది, ఇక పెద్ద వ్యాపారాలు కూడా బాగానే ప్రభావితం అయ్యారు. ఈ విషయం ఒప్పుకుని తీరాలి. అందుకే అప్పటి నుండి వాళ్ళందరూ ప్రతీకారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. సాధారణంగా అయితే ఏదైనా కావాలి అంటే వీధి చివరన ఉన్న కొట్లోకో లేదా సెంటర్ కు వెళ్లి అక్కడ ఉన్న షాప్ లోకో వెళ్లి ఆయా వస్తువులను కొనుగోలు చేస్తుండే వారు దేశీయులు. కానీ ఈ కామర్స్ భారత మార్కెట్ లోకి వచ్చిన తరువాత మంచం దికగాకుండా అన్నీ వచ్చేస్తుండటంతో వాటికే బాగా అలవాటు పడిపోయారు. ఇక ఇది కరోనా సమయంలో అయితే చెప్పాల్సిన పనేలేదు. అంతగా ఈ వ్యాపారాలు ప్రజలలోకి వెళ్లిపోయాయి. దీనితో ఆయా వ్యాపారస్తులు బాగా నష్టాలపాలు కాకతప్పలేదు.

ఈ కొత్త సమస్య నుండి పరిష్కారం కోసమే ఆయా ప్రాంతీయ దుకాణాల తో అమెజాన్ ఒప్పందం చేసుకొని వాళ్ళ వద్ద నుండి వినియోగదారులకు సరుకు అందించేట్టుగా కొత్త పంధా మొదలుపెట్టింది. అయితే అది కాస్త మెలికతో ఉండటంతో అందరికి నచ్చడం లేదు. అమెజాన్ ఆయా దేశాల ఉత్పత్తులను ఈ ప్రాంతీయ దుకాణాలలో ప్రవేశపెట్టడం అనేది ఎక్కువ కావడంతో వాటికే ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు. అంటే అమెజాన్ వాళ్ళతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తమ దుకాణాలలో సరుకు అనుకున్నంతగా అమ్మకం లేకపోవడం ఇక్కడ సమస్యగా పరిణమించింది. అంటే ఒప్పందం ఒకందుకు చేసుకున్న అమెజాన్ తరువాత దానిని తనకు అనుకూలంగానే మార్చుకుంది. అందుకే అది అందరికి నచ్చలేదు.

ఈ విధంగా కూడా వ్యాపారాలు పెద్దగా లాభపడింది లేకపోవడంతో అమెజాన్ పై యుద్దానికి సిద్ధం అయ్యారు. గతంలో పుల్వామా ఘటనలో వాడిన పేలుడు పదార్దాల తయారీకి వాడిన రసాయనాలు అమెజాన్ నుండి కొన్నట్టుగా దర్యాప్తు సంస్థ నివేదిక ఇచ్చింది. అయినా ఆ సంస్థ పరువు పోతుందని దానిని ఎవరు కూడా బయటకు పెద్దగా రానీయలేదు. అది ఇప్పుడు వ్యాపారాలు బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు నిషేదించిన రసాయనాలు ఎలా సంస్థ భారత్ లోకి తెస్తుంది అనే దానిపై వ్యాపారాలు కేసులు నమోదు చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఇలా వ్యాపారస్తులు అమెజాన్ పై తమ ప్రతీకారాన్ని తీర్చుకోడానికి తమకు తోచిన ప్రయత్నం ఎదో చేస్తున్నారు. చూడాలి ఏ మాత్రం అమెజాన్ ని కడుపుతుందో ఈ విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: