దేశంలో జీఎస్టీ వసూళ్లు పుజుకుంటూనే ఉన్నాయి. మరోసారి పన్ను వసూళ్లు కొత్త రికార్డును సృష్టించాయి. తాజాగా విడుదలైన నివేదికలు ఇవే చెపుతున్నాయి. ఈ నెలలో పన్ను వసూలు 131526 కోట్లుగా నమోదు అయ్యింది.గత నెలతో పోలిస్తే ఇందులో పెరుగుదల చోటు చేసుకుంది. గత నెలలో జీఎస్టీ వసూళ్లు 1.30 లక్షల కోట్లుగా ఉంది. ఈ నెల వసూళ్లు జీఎస్టీ ప్రారంభం అయిన తరువాత రెండో స్థానంలో నిలిచింది. మొదటిది కూడా ఈ సంవత్సరం ఏప్రిల్ లో చోటుచేసుకుంది, ఈ నెలలో 1.41కోట్ల వసూళ్లు జరిగాయి. అయితే నవంబర్ లో సరికొత్త రికార్డును సృష్టించడం అన్న విషయంపై ఆశలు పెట్టుకున్నప్పటికీ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం పన్ను వసూళ్ళలో సీజీఎస్టి విలువ 23978 కోట్లుగా ఉంది.

నవంబర్ జీఎస్టీలో ఐజీఎస్టీ  వాటా 66815 కోట్లుగా ఉంది. ఇందులో రాష్ట్రాల వాటా 31127 కోట్లుగా ఉంది. దిగుమతి వలన వచ్చిన ఐజీఎస్టీ విలువ 32165 కోట్లు కాగా, సెస్ మీద వసూళ్లు 9607 కోట్లుగా ఉంది. గత నవంబర్ తో పోల్చుకుంటే ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లు 25 శాతం పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. గత నవంబర్ లో వసూళ్లు 1.04 లక్షల కోట్లుగా ఉంది. అంతకముందు నవంబర్ తో పోల్చుకుంటే 27 శాతం ఎక్కువ వసూళ్లు ఈ నెల జరిగినట్టే. అయితే గత నెలతో పోల్చుకుంటే నవంబర్ లో ఈ బిల్లులు తక్కువగా నమోదు కావడం జరిగింది. దీనితో డిసెంబర్ లో వసూళ్లు తగ్గవచ్చనేది అంచనా వేస్తున్నారు.

అక్టోబర్ లో రోజుకు ఈ-బిల్లులు 23.70 లక్షలు వచ్చాయి కానీ నవంబర్ లో వాటి సంఖ్య 18.76 లక్షలకు తగ్గింది. ఈ నెలలలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కూడా జరగాల్సి ఉండగా, అది వాయిదా పడింది. ఈ సమావేశంలో మరి కొన్ని వెసులుబాట్లు కలిపించే యోచనలో ఉన్నప్పటికీ వసూళ్లు తగ్గే సూచనలు ఉండటంతో ఆ దిశగా చర్యలు ఉండేట్టుగా లేవు. ఈ ఆర్థిక సంవత్సరంలో వసూళ్లు పరికిస్తే, మే నెలలో 1.02 లక్షల కోట్లు, జూన్ లో 0.92 లక్షల కోట్లు, జులై లో 1.16 లక్షల కోట్లు, ఆగష్టు లో 1.12 లక్షల కోట్లు, సెప్టెంబర్ లో 1.17 లక్షల కోట్లు, అక్టోబర్ లో 1.3 లక్షల కోట్లుగా ఉంది. ఒక్క నెలలో లక్ష కోట్లకు కాస్త తగ్గినట్టుగా అనిపించినా, మిగిలిన నెలలలో లక్ష దాటే వసూళ్లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

gst