రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్తగా ఎయిర్ పైబర్ ను తీసుకురానున్నట్లు ఇటీవల ప్రకటించింది. అంటే ఇప్పటి వరకు పైబర్ నెట్ వరకు మాత్రమే ఈ రంగంలో ఎయిర్ పైబర్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.  ఇప్పటి వరకు ఎయిర్ ఫైబర్ అనేది లేదు. కేవలం సన్ నెట్ వర్క్, జీ ఎంటర్ టైన్ మెంట్ ఇతర సంస్థలు పైబర్ నెట్ వర్క్ ద్వారా తమ ప్రాబల్యాన్ని చాటుకున్నాయి.


కార్పొరేట్ సంస్థలు ఎన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చినా కానీ ప్రజలు లోకల్ కేబుల్ ఆపరేటర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు అందించని సర్వీసులను ఈ సంస్థలు అందిస్తున్నాయి. కాబట్టి వీటిలో పెద్దగా రాణించడం లేదు. అయితే ఆయా టీవీ చానళ్ల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుని నిలదొక్కుకోగలుగుతున్నాయి. ఇలా కేబుల్ రంగంలో అవి మనుగడ సాధిస్తున్నాయి.


అయితే జియో ఎయిర్ పైబర్ తీసుకురావడం అది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.  అయితే అంబానీ తీసుకురాబోతున్న జియో ఎయిర్ ఫైబర్ నెట్ వర్క్ తో ఎలాంటి కేబుల్ కనెక్షన్ లేకుండానే ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఇందులో మరో విషయం ఏమిటంటే 5 జీ నెట్ వర్క్ తో హై స్పీడ్ తో ఇంటిలో, ఆఫీసులో కూడా వాడుకోవచ్చు. కేవలం ఒక ఫ్లగ్ ఇస్తారు. దాని స్విచ్ ఆన్ చేసుకుంటే చాలు.  ఇంటిల్లి పాదికీ ఎలాంటి కేబుల్ కనెక్షన్ లేకుండా ఇంటర్నెట్ వాడుకోవచ్చు.


ఇది మరోక విప్లవాత్మక సంచలన నిర్ణయం అని చెప్పవచ్చు. ఇది ఒక వేళ సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో కేబుల్ తో ఇంటర్నేట్ ఇస్తున్న సంస్థలు నష్టపోతాయా? ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎయిర్ ఫైబర్ వల్ల రాబోయే రోజుల్లో ఏమైనా ప్రజలకు లాభంతో పాటు ఏదైనా ఆరోగ్య పరమైన నష్టాలు జరిగే అవకాశం ఉందా విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: