ఆపిల్ లవర్స్ కు గుడ్ న్యూస్... ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 10 ఇండియాకు వచ్చేస్తోంది. నవంబర్ 3 నుంచి తన యానివర్శరీ ఎడిషన్ ను ఇండియాలో డెలీవరీ చేసేందుకు ఈ టెక్ దిగ్గజం సిద్ధమవుతోంది. ఈ సూపర్ ఫోన్ ప్రీ రిజిస్ట్రేషన్ మరో రెండ్రోజుల్లో అంటే అక్టోబర్ 27న ఈ కామర్స్ వెబ్ సైట్లలో మొదలవుతుంది.ఆపిల్ 10తో పాటే విడుదలైన ఐఫోన్ 8, 8ప్లస్ ఇండియా మార్కెట్లోకి ఎప్పుడో వచ్చేశాయి. అయితే చాలామంది ప్రేమికులు మాత్రం 10 ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ధర కాస్త ఎక్కువే అయినా ఆపిల్ కున్నంత క్రేజ్ మరే ఫోన్ కు లేదు.ఐఫోన్ 10 సిల్వర్, స్పేస్ గ్రే అనే రెండు కలర్స్ లో లభ్యమవుతుంది. అంతేకాదు 64జీబీ, 256జీబీ స్టోరేజ్ కెపాసిటీతో ఇవి అందుబాటులోకి రానున్నాయి. బేసిక్ మోడల్ కాస్ట్ దాదాపు 89వేలుగా నిర్ణయించారు. స్టోరేజ్ పెరిగితే రేటు పెరుగుతుంది. ఐఫోన్ 10 ఇటీవలే ఫారిన్ మార్కెట్లో రిలీజ్ అయి దుమ్మురేపుతోంది. ఓ రకంగా డిమాండ్ కు తగ్గ ప్రొడక్షన్ లేదు. అయినా సరే నవంబర్ 3 నుంచి మన దగ్గర విడుదల చేయనున్నారు.
ఇక ఐఫోన్ 10 ప్రత్యేకతల విషయానికి వస్తే....
గ్లాసీ స్టెయిన్ లెస్ స్టీల్ ప్రేమ్ బాడీ
5.8 ఇంచ్ ల సూపర్ రెటీనా ఓలెడ్ డిస్ ప్లే
12మెగాపిక్సల్ బ్యాక్ డ్యూయల్ కెమరా
ఫ్రంట్ సైడ్ 7ఎంపీ ట్రూ డెప్త్ కెమెరా
అగ్మెంట్ రియాలిటీ ఎక్స్ పీరియన్స్ కెమెరా
కస్టమ్ ఐకానిక్ హోమ్ బటన్ కు గుడ్‌బై
స్వైప్ బేస్డ్ గెస్చర్స్ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ
వాయిస్ బేస్డ్ యానిమేటెడ్ ఎమోజీ