నాన్ వెజ్ లో చాలా మంది ఇష్టపడేది గోంగూర మటన్. గోంగూర చికెన్ కూడా చాలా మందికి ఇష్టమే గాని అవి చేసుకోవడం అనేది చాలా మందికి పాపం కష్టంగా ఉంటుంది. అందుకే ఎక్కువగా బయటి నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తినాలి అనే కోరిక ఉన్నా సరే చేసుకోవడం రాక చాలా మంది చేసుకునే పరిస్థితి ఉండదు. అసలు గోంగూర మటన్ ఎలాగో ఒకసారి చూద్దాం. అసలు అందుకు కావాల్సినవి ఏంటీ అనేది కూడా చూద్దాం.

గోంగూర ఆకులు – 250 గ్రాములు కావాలి. మేక మాంసం – 500 గ్రాములు కావాలి. కొత్తిమీర – తగినంత వేయండి. పుదీన – గుప్పెడు చాలు. అలాగే ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి),  అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 2 టీ స్పూన్లు చాలు. పసుపు – అర టీ స్పూన్‌ వేయండి. కొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు వేయండి. ఉప్పు – తగినంత వేయండి.  కారం – తగినంత వేసుకోండి. మసాలా – (లవంగాలు –4, యాలకులు –4, ధనియాలు టేబుల్‌ స్పూన్‌. ఇవన్నీ కలిపి వేయించి, పొడి చేయాలి) గసగసాలు – టీ స్పూన్‌ వేసుకోండి. మటన్‌ ముక్కలను వేడి నీటిలో 10 నిమిషాలు ఉడికించండి.

అప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయండి. అందులో సాజీరా ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి. అల్లం వెల్లుల్లి ఫేస్ట్, పుసుపు వేసి కలపండి. అందులో  మటన్‌ వేసి 5 నిమిషాలు ఉడికించండి.  ఆ తర్వాత గినంత కారం, ఉప్పు కలిపి దానిని ఉడికించాలి.  అప్పుడు కొబ్బరి పొడి వేసి 15 నిమిషాలు ఉడికించండి.  ఆ తర్వాత  అందులో తరిగిన గోంగూర ఆకులు వేసి ఉడికించండి.  ఆ తర్వాత చివరగా గరం మసాలా, కొత్తి మీర వేసి దించండి. అంతే  నోరు ఊరించే గోంగూర మటన్ కర్రీ రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: