క్రికెట్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ లో భాగంగా అప్పులపాలైన ఓ యుకుడు తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాకు అల్లవరం మండలం కొమరగిరిపట్న వాసి ఆకుల వంశీ రామ తిరుపతిరావు(30). ఇతడు హైదరాబాద్ లో ఇంజనీర్ గా పనిచేసేవాడు. కాగా అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  వీరిద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగులుగా మంచి పోజీషన్ లో స్థిరపడ్డారు. కానీ మూడేండ్ల కిందట వంశీ తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. దీంతో వంశీకి తన భార్యకు మధ్యన గొడవలు మొదలయ్యాయి. అప్పటి నుంచి వంశీ తన భార్య నుంచి విడిగా ఉంటున్నాడు.

ఉద్యోగం పోవడంతో వంశీ తన స్వంత గ్రామానికి వచ్చి వారి తల్లిదండ్రులతో ఉంటున్నాడు. కాగా ఆ క్రమంలోనే క్రికెట్ బెట్టింగ్ లకు బాగా అలవాటు పడిపోయాడు వంశీ.  అయితే ఈ బెట్టింగుల్లో వంశీ దాదాపుగా రూ.1.50 కోట్ల వరకు అప్పుల పాలయ్యాడట. వంశీ చేసిన అప్పులను తన తండ్రి కొంత వరకు తీర్చాడట. వంశీ తల్లిదండ్రులు కూడా క్రికెట్ బెట్టింగులు మానుకోవాలని వేడుకున్నారట. కానీ వంశీ మాత్రం బెట్టింగు అలవాటును మానుకోలేకపోయాడు. కానీ అతడికి బెట్టింగుకు అవసరమయ్యే అప్పును ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

దీనికి తోడు అప్పిచ్చిన వాళ్లు ఊరుకుంటారా.. వంశీని డబ్బులు కట్టాలంటూ వేధించసాగారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పొలంలోని పశువులపాకలో ఉన్న పురుగుల మందును తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే అది తాగిన కొద్ది సేపటికి వంశీ ఆ బాధను భరించలేకపెద్దగా కేకలు వేసాడు. దాంతో పొలంలో పనులు చేసుకుంటున్న కుటుంబ సభ్యులు హుటాహుటినా అక్కడకు చేరుకుని అమలాపురంలోని ఓ ప్రైవేట్ హాస్పటల్ కు తీసుకెళ్లారు. కాగా వంశీ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడని పోలీసులు వెళ్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: