ఎన్ని చట్టాలు, ఎన్ని శిక్షలు విధించినగాని ఆడవాళ్లపై జరిగే అత్యచారాలు ఆగడం లేదు ఎక్కడో ఒక చోట ఎదో ఒక రూపంలో అరాచకులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరొక ఘోరం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని దుండగలు ఒక యువతీ పై అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా ఆమె సహకరించలేదని ఆమెను ఏమి చేసారో తెలిస్తే సభ్య సమాజం తల దించుకుంటుంది. అసలు వివరాల్లోకి వెళితే లలిత్ పూర్ జిల్లాకు చెందన ఓ మహళను దారుణంగా హింసించారు కిరాతుకులు. ఈ దారుణమైన ఘటన జులై 21న ధమ్నా అనే గ్రామంలో వెలుగు చూసింది. బాధితురాలు అదే గ్రామంలో  కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబానికి అండగా ఉంటుంది. ఆరోజు  వ్యాపారం అయిపోయాక సాయంత్రం చీకటి పడే సమయంలో కూరగాయలు దుకాణం కట్టేసి ఇంటికి వెళ్తుందట.ఒక్కటే చీకట్లో రోడ్డు మీద వెళ్తున్న యువతిని గమించిన ఒక ఇద్దరు ఆకతాయిలు ఆమెని వెంబడించి ఆమె వెనకాలే వచ్చి ఆమెను అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసారు.


వారిని గమనించిన ఆ యువతీ తన చెప్పులు తీసి,ఆ ఇద్దర్నీ కొట్టింది. ఆమెతో చెప్పు దెబ్బలు తిన్న ఆ ఇద్దరూ తమకు జరిగిన అవమానాన్ని మనసులో పెట్టుకుని ఆ అవమానాన్ని భరించలేక మమ్మల్నే చెప్పు తీసుకుని కొడతావా అని కోపంతో  ఇద్దరూ ఆమెను ఘోరంగా కొట్టి తమ దగ్గర ఉన్న కత్తి తీసి, సిగరెట్ లైటర్‌తో కత్తిని కాల్చి ఆమె రెండు కళ్లలో బలవంతంగా పొడిచేసారు. పాపం వద్దు అన్న ఆమెని వదలలేదు. అయితే అక్కడికి దగ్గరలో పోలీస్ వాహనం సైరన్ కూడా వినిపించింది.కానీ ఆ యువతిని పోలీసులు చూడలేదు.సైరన్ వినిపించడంతో ఆ ఇద్దరు దుండగులు అక్కడి నుండి పారిపోయారు.

మరుసటి రోజు ఉదయం ఆమె కుటుంబ సభ్యులు ఆమెను వెతుక్కుంటూ వచ్చి చూడగా, ఆమె వదినకి సొమ్మ సిల్లి పడివున్న ఆమెను చూసి హడావుడిగా యువతీ దగ్గరకు వెళ్లి హుటాహుటిన పోలీసులకు చెప్పి వెంటనే అంబులెన్స్‌ లో ఆసుపత్రికి పంపారు. బాధితురాలి వదిన చెప్పిన స్టేట్మెంట్ ప్రకారంగా ఆ ఇద్దరూ స్థానికులే అని తెలిసింది. తరచూ నేరాలు చేస్తూ ఉండేవారు అంట. మూడు నెలల కిందటే వీళ్ళే బాధితురాలిని రేప్ చెయ్యాలని ప్రయత్నించి కుదరక  లైంగికంగా వేధించారని ఆమె చెప్పింది.అప్పట్లో పోలీసులకు చెప్పినాగాని అధికారులు  ఏ చర్యలూ తీసుకోలేదని ఆమె వివరించింది. దీనిపై లలిత్ పూర్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గిర్జేష్ కుమార్ స్పందించారు. .

మరింత సమాచారం తెలుసుకోండి: