సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగుల్చుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఓ యువతికి మాత్రం ప్రేమ అనేది ఒక కాళరాత్రి గా మారిపోయింది. ప్రేమించడమే ఆ యువతి పాపం గా మారిపోయింది.  ప్రేమించిన వ్యక్తి దారుణంగా వేధించడం మొదలు పెట్టాడు. ప్రేమించిన యువకుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ ఆరోపిస్తూ యువతి ఏకంగా పోలీసులను ఆశ్రయించింది. Ee ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ లో వెలుగులోకి వచ్చింది. సదరు వివాహిత అక్షయ్  అనే యువకుడు నాలుగేళ్లపాటు ప్రేమించుకున్నారు. కానీ వీరి ప్రేమ మాత్రం పెళ్లి వరకు వెళ్ళలేదు.


 చివరికి మహిళా వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక ఆ మహిళకు పెళ్లయి మూడేళ్లు గడుస్తున్నాయ్. అయితే ఒక నెల క్రితమే మహిళ మాజీ బాయ్ ఫ్రెండ్ మళ్లీ ఆమెతో మాట్లాడటం మొదలు పెట్టాడు  ఇక ఒత్తిడి తీసుకురావడంతో ఒకసారి కలిసింది కూడా. ఇద్దరు కలిసి ఎన్నో ప్రాంతాలలో చెట్టాపట్టాలేసుకుని తిరిగారూ. ఈ క్రమంలోనే తన మాజీ ప్రియుడు తన పై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ యువతి ఆరోపిస్తుంది. అంతేకాదు ఏకంగా తన భర్తను వదిలి అతనితో పాటు రావాలి అంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు అని ఆ యువతి చెప్పుకొచ్చింది.



 ఇలా తనపై పలుమార్లు అత్యాచారం చేశాడు అంటూ ఆరోపించింది. అయితే ఇటీవలే మరోసారి హోటల్ తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ మహిళ ప్రతిఘటించడంతో ఆ మహిళ కు విషం తాగించి.. అతను విషం తాగాడు   ఇక ఈ విషయాన్ని సదరు యువకుడు తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే అప్రమత్తమైన స్నేహితులు వారిద్దరిని కూడా స్థానిక ప్రైవేటు ఆస్పత్రి తరలించారూ. ఇటీవలే ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్న ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది   బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: