ఈ మధ్య కాలంలో దొంగలు కూడా ఎంతో తెలివిగా అని ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఇంట్లోకి చొరబడి  విలువైన వస్తువులు నగలు నగదు ఎక్కడ ఉన్నాయి అనే వెతికి ఇక ఎవరికీ తెలియకుండా వాటిని చోరీ చేసేవారు. అయితే ఇలా ఇళ్లల్లోకి దొంగతనాలకు వెళ్లిన దొంగలకు కొన్నిసార్లు నిరాశే ఎదురవుతూ ఉంటుంది. విలువైన వస్తువులు నగలు ఎక్కడ ఉన్నాయో తెలియకపోవడంతో ఒట్టి చేతులతో తిరిగి వచ్చేవారు. అందుకే ఇక ఇప్పుడు ఇళ్లల్లో చోరీలు చేయడం కాదు ఏకంగా డబ్బులు పక్క ఉంటాయి అన్న నమ్మకం కూడా ఏటీఎంలో చోరీ ఎలా ఉంటుంది అని భావిస్తున్నారు దొంగలు. అందుకేనేమో ఇటీవల కాలంలో ఏటీఎం దొంగతనాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.


 సాధారణంగా ఏటీఎం సెంటర్లలో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ  ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీకెమెరాలకు చిక్కకుండా ఎంతోమంది చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. అయితే దొంగతనాలకు వెళ్లిన వ్యక్తులు చాలా అలర్ట్ గా ఉంటారు. చిన్న గుండు పిన్ను శబ్దం వచ్చిన కూడా ఒక్కసారిగా అప్రమత్తం అవుతూ ఉంటారు. అలాంటిది పెద్ద అలారం మోగింది అంటే చాలు వెంటనే అప్రమత్తమై ఎంతో జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. కానీ పాపం ఇక్కడ ఒక దొంగ మాత్రం తనకు ఉన్న సమస్య కారణంగా చివరికి పోలీసులకు దొరికిపోయాడు.



 ఏటీఎంలో చోరీ చేయాలనుకున్న దొంగకు వినికిడి లోపం ఉంది. దీంతో ఏటీఎం చోరీకి వెళ్లి చివరికి కటకటాలపాలయ్యాడు.. ఈ ఘటన తెలంగాణలోని నిజాంబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. సునీల్ అనే వ్యక్తి అర్ధరాత్రి పద్మ నగరంలోని ఓ ఏటీఎంలో చోరీ చేసేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలోనే ఏటీఎం  మిషన్ ను పగలగొట్టి డబ్బును కాలచేయాలి అని అనుకున్నాడు.. ఇక ఏటీఎం మిషన్ పగలగొట్టడంతో అలారం మోగింది అతనికి సరిగ్గా చెవులు వినిపించవు. దీంతో శబ్దాన్ని గమనించలేకపోయాడు. కానీ చుట్టుపక్కల వారు మాత్రం ఆ అలారం సౌండ్ కి నిద్ర లేచారు. దీంతో ఏటీఎం దొంగతనం జరుగుతుంది అని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ దొంగకు షాకిచ్చారు. చివరికి అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: