ప్రస్తుతం సినిమా ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సినిమాలు మాత్రమే ఎంటర్టైన్మెంట్ పంచాయ్. కానీ ఇప్పుడు మాత్రం ఓటిటి లు అందుబాటులోకి రావడంతో ఎంతోమంది ఓటిటి ద్వారా కూడా సినిమాలను విడుదల చేస్తుండటం గమనార్హం. ఇలా సినిమా రంగం మొత్తం కొత్త పుంతలు తొక్కుతూ ఉంటే.. అటుఎంతోమంది జనాలలో సీరియల్ పిచ్చి మాత్రం వదలడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో సీరియల్ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. అభిమాన సీరియల్ వస్తుందంటే చాలు అన్ని పనులు పక్కనపడిటీవీలకు అతుక్కుపోతుంటారు జనాలు.ముఖ్యంగా మహిళలు అయితే సీరియల్ వస్తుంది అంటే టీవీ కి అతుక్కుపోయి పక్కన ప్రపంచాన్ని అస్సలు పట్టించుకోరు.



 ఇలా ఇక్కడ మహిళలకు ఉన్న సీరియల్ పిచ్చి ఏకంగా లక్షల నష్టాన్ని కలిగించింది. తమిళనాడులో ఈ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలు ఇంట్లో టీవీ సీరియల్ చూస్తూ నిమగ్నమైపోయారు.ఆ సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు యాదేచ్చగా దొంగతనానికి పాల్పడ్డారు.  19 లక్షల రూపాయలు కాచేశారు. వివరాల్లోకి వెళితే ఇద్దరు మహిళలు రాత్రి సమయంలో తమకు ఇష్టమైనసీరియల్ వచ్చిందని టీవీ చూస్తూ నిమగ్నమైపోయాడు. ఇక రాత్రి పదకొండు దాటింది. ఇంట్లోఇద్దరు మహిళలు తప్ప ఇంకెవరూ లేరు. మొత్తం సిరీయల్ లో మునిగితేలుతున్నారు ఇద్దరు మహిళలు.. ఈ కార్యక్రమంలో ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. చప్పుడు అయినప్పటికీ మహిళలు మాత్రం టీవీ సీరియల్ లో మునిగిపోవడంతో ఎంతో ధైర్యంగా ఇంట్లోకి వచ్చి విలువైన వస్తువులను వెతికి మరీ 19 లక్షలు ఎత్తుకెళ్లారు. చూస్తుండగానే అంతా నిమిషాల్లో జరిగిపోయింది. ఇక దొంగలు ఇంత చేస్తున్నా అటు ఇద్దరు మహిళలు మాత్రం టీవీ పిచ్చి లోనే ఉండిపోయారు. ఇక చివరికి సీరియల్ ముగిసిన  తర్వాత చూసేసరికి చోరీ జరిగినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: