నేటి రోజుల్లో మనుషులని ఎవరిని చూసినా భయపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనిషిలో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగై పోయింది. ఎప్పుడూ ఎవరో ఒకరిని మోసం చేయాలి అనే ఆలోచన తప్ప ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన మాత్రం ఎవరికి రావడం లేదు. దీంతో తీయ్యగా మాట్లాడుతున్న వారిని చూసిన కూడా భయపడే పరిస్థితి వచ్చింది  ఇక ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మ కూడదో తెలియక అందరిపై అనుమానం పెంచుకునే దుస్థితి ఏర్పడింది. కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే...ప్రతి ఒక్కరీ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండడమే బెటర్ అని అర్థం అవుతూ ఉంటుంది.



 ఇటీవలి కాలం లో సాయం పేరుతో నమ్మించి మంచి వాళ్ళం అంటూ దగ్గర అయి ఇక ఎంతో మంది యువతులను నయవంచన చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. తల్లి దండ్రులతో గొడవపడి ఇంట్లో నుంచి వచ్చేసిన యువతికి మాయమాటలు చెప్పి సహాయం చేస్తా అంటూ చివరికి అమ్మేసిన ఒక నిందితుడిని ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కోలార్కు చెందిన యువతి ఇంట్లో గొడవపడి బెంగళూరుకు వచ్చింది.


 కాగా ట్రావెల్ ఏజెన్సీ లో పనిచేసే నాగేష్ ఆ యువతిని పలకరించి ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. ఈ క్రమంలోనే ఆ యువతిని దేహానహళ్లికి తీసుకొని అత్యాచారం చేశాడు. ఇక ఆ తర్వాత ఢిల్లీకి తీసుకెళ్లి వ్యభిచార గృహానికి విక్రయించాలని ప్లాన్ వేసుకున్నాడు. అయితే ఇక ఎయిర్పోర్టులో నాగేష్ యువతి ప్రవర్తనపై అనుమానం వచ్చినా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలువెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. ఇకపోతే ఇటీవల కాలంలో ఇలా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఎంతోమంది అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న కేటుగాళ్లు దారుణంగా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: