సాధారణంగా గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి లేఖలు అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇలా ఒక బాలిక రాసిన లేఖ కాస్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు లో వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ ఎమ్మెల్యే, ప్రెస్ కు ఒక విద్యార్థిని లేఖ రాసింది. ఇందులో సంచలన విషయాలను ప్రస్తావించింది. దాదాపు 330 మంది విద్యార్థులు చదువుకుంటున్న  ఈ గురుకులంలో తెలియని విద్యార్థిని రాసిన లేఖ సంచలన గా మారిపోయింది.



 గురుకులంలో సెక్యూరిటీ గార్డుగా పని చేసే గౌస్ సాజియా అనే వ్యక్తులు ఇంట్లో ఒంటిపై బట్టలు లేకుండా గడుపుతారు. ఇక ఆడపిల్లలు స్నానాలు చేస్తున్న గదుల్లోకి గౌస్ వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. హాస్టల్ కు కొద్ది దూరంలో స్కూలు ఉంటుంది. అక్కడ పనిచేసే కొంతమంది సిబ్బంది గది అద్దెకు తీసుకున్నారు. ఇక అక్కడకు తమను పంపి ఇక బలవంతం చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. బయట ఎవరికైనా ఈ విషయం చెబితే చంపేస్తామని బెదిరింపులు కూడా పాల్పడుతున్నారు. అంతేకాదు టీసీలు ఇచ్చి ఇక చదువు నాశనం చేస్తామంటూ బెదిరిస్తున్నారు. వీరి భారీ  నుంచి మమ్మల్ని కాపాడండి సార్ ప్లీజ్ అంటూ ఓ బాలిక యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కు లేఖ రాయడం సంచలనంగా మారింది.


 అయితే ఇప్పటికే ఆలేరు గురుకులంలో సిబ్బంది బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని ఆరోపణలు రావడం అంతలోనే ఇక ఈ లేక బయటకు రావడం మరింత చర్చనీయాంశంగా   మారిపోయింది. అయితే కాలేజీ లో పనిచేసే ఆసియా ఆమె భర్తకు మధ్య ఎన్నో రోజుల నుంచి ఉన్న గొడవలే ఈ లేఖకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఇక ఆసియా పై ఉన్న కక్షతోనే అరీఫ్ విద్యార్థిని పేరుతో లేఖ రాసి హల్చల్ చేసాడని పోలీసులు గుర్తించారు. కళాశాల ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇటీవలే మైనారిటీ పాఠశాల ను సందర్శించిన ఎమ్మెల్యే గొంగిడి సునీత సంచలనంగా  మారిన లేక మొత్తం ఒక కుట్ర అంటూ తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి: