
అయితే లగ్జరీ కార్లలో ఎంతో దర్జాగా వచ్చి దొంగతనాలు చేయడం మాత్రం చాలా తక్కువగా వెలుగులోకి వస్తూ ఉంటాయి. అది కూడా ఏకంగా పశువులను దొంగతనం చేయడం చాలా అరుదు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఒక అరుదైన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇటీవల కొంతమంది కార్ లో వచ్చి పశువుల దొంగలించిన ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది. ఏకంగా కారులో వచ్చిన దుండగులు మనుషులకు చూపించినట్లు గానే ఆవులకు కత్తులు చూపించి ఆవులను దొంగలించారు. ఇటీవల జరిగిన ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనం గా మారిపోయింది.
బంగలేగుడ్డే వద్ద క్యాంపస్ లో కొన్ని ఆవులు ఉన్నాయి. ఇక ఇలాంటి సమయంలోనే కొంత మంది వ్యక్తులు కారులో అక్కడికి వచ్చారు. ఏకంగా కత్తులు చూపించి ఆవులను దొంగలించినట్లు సమాచారం. ఆవులను తరలించేందుకు ఎంతో విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తూ ఉండడం గమనార్హం పశువుల దొంగతనాలను ఆపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హిందూ సంఘాల కార్యకర్తలు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కార్ కూ వేరే నెంబర్ ప్లేట్ తో ఓన్నీ లో వచ్చి అంతకు ముందు రోజు కూడా పశువులను దొంగలించారు అంటూ హిందూ సంఘాల కార్యకర్తలు ఆరోపిస్తూ ఉన్నారు. వెంటనే పశువుల దొంగతనాలను అదుపు చేయాలి అంటూ కోరుతున్నారు.