
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం.. ఏకంగా ప్రేమను గెలిపించుకోవడానికి అబ్బాయి అమ్మాయిగా మారడం.. అమ్మాయి అబ్బాయి గా మారడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటివి కేవలం సినిమాల్లోనే కాదు ఇటీవలికాలంలో నిజజీవితంలో కూడా జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ప్రేమ కోసం ఒక అబ్బాయి అమ్మాయిగా మారిన ఘటన వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఇలాంటిదే జరిగింది. ప్రేమ కోసం ఏకంగా ఒక మహిళ పురుషుడి గా మారిపోయింది.
కానీ చివరికి మరో మహిళ చేతిలో నిండా మోసపోయింది. ఈ ఘటన తమిళనాడులోని మదురై విల్లా పురం లో వెలుగులోకి వచ్చింది. జయసుధ, సెంతిలా అనే ఇద్దరు యువతులు స్నేహితులు. ఈ మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఇద్దరు మహిళలు కావడంతో ఈ సభ్య సమాజం తమా పెళ్లిని అంగీకరించదు అని భావించారు. ఈ క్రమంలోనే జయసుధను పురుషుడి గా మారాలి అంటూ సెంతిలా ఒత్తిడి తీసుకు వచ్చింది. ఇక ఆపరేషన్ చేయించుకుని జయసుధ ఆది శివ గా మారిపోయాడు. తర్వాత పెళ్లి చేసుకుని కొన్నాళ్లపాటు కలిసి ఉన్నారు. కానీ ఆ తర్వాత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా చివరికి మా వారి తో వెళ్ళిపోయింది సెంతిలా. తనకు న్యాయం చేయాలంటూ ఆది శివ పోలీసులను ఆశ్రయించాడు..