నేటి రోజుల్లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ప్రతి మహిళ భయం తో ఊగిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. ఇక మహిళల పై అత్యాచారం చేసిన వారిని ఎన్ కౌంటర్ చేసి పోలీసులు శిక్షించిన ఎక్కడ పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. రోజు రోజుకు ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు పెరిగి పోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గు ముఖం పట్టడం లేదు అని చెప్పాలి. అయితే అయితే నేటి రోజుల్లో కామాంధులు మరింత తెగించి మరీ దారుణాలకు పాల్పడుతూ ఉండటం గమనార్హం.


 ఒకప్పుడు కేవలం ఒంటరిగా ఉన్న ఆడ పిల్లలపై మాత్రమే అత్యాచారాలకు పాల్పడే వారు. ఆడపిల్లల పక్కన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారు అంటే ఆడపిల్లల జోలికి వెళ్లకుండా సైలెంట్ గానే ఉండేవారు కామాంధులు. కానీ ఇటీవలి కాలం లో ఏకంగా ఆడపిల్లల పక్కన కుటుంబీకులు ఉన్నా కూడా వారిపై దాడి చేసి మరి అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు  లోకి వస్తున్నాయి. దీంతో ఆడపిల్ల ప్రతి క్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.



 బాపట్ల జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. రైల్వే స్టేషన్ లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన సంచలనం గా మారి పోయింది అని చెప్పాలి. ఏకంగా రైలుకోసం భర్తతో కలిసి వేచి చూస్తూ ఉంది ఒక మహిళ. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన కొంతమంది దుండగులు భర్తపై దాడి చేసి కొట్టారు. ఇక ఆ తర్వాత మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ముగ్గురు నిందితులు తనపై అత్యాచారం చేశారు అంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: