ఇంటి నుంచి కాలు బయట పెడితే చాలు కామాంధులు అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు కేవలం బయట వాళ్ళు మాత్రమే ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తే ఇటీవల కాలంలో మానవ సంబంధాలను మరిచిపోతున్న సొంత వారు సైతం అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు అందరిని మరింత భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఆరేళ్ల బాలికపై నలుగురు బాలురు ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖుషియార్ పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
దాదాపు ఏడాదిగా నలుగురు బాలురు 6 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారు. ఇక ఇటీవల వేధింపులు తట్టుకోలేక పోయిన బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక వెంటనే తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు పోక్సో చట్టం కింద నలుగురిపై కేసు నమోదు చేశారు. కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక మరో బాలుడు పరారీలో ఉన్నట్లు గుర్తించి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి