ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద మరీ ఎక్కువై పోయింది. కొంత మంది తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతు ఉంటే మరి కొంత మంది దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇంకొంత మంది బయట పార్క్ చేసి ఉన్న వాహనాలను దొంగలిస్తూ షాక్ ఇస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం గా ఉంటూ చోరీలకు పాల్పడుతున్న దొంగల ఆటకట్టిస్తున్నారు అని చెప్పాలి. అయినప్పటికీ దొంగలు మాత్రం ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. ఇక్కడ ఓ నిందితుడు మరింత రెచ్చి పోయాడు.


 దొంగతనం చేసాడు అనే ఆరోపణల తో పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. చేతికి బేడీలు కూడా వేశారు. అయితే సినిమాల్లో బేడి లతోనే దొంగలు తప్పించుకున్నట్లు ఇక్కడ దొంగ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. ఇలా తప్పించుకున్న తర్వాత మరోసారి చేతివాటం చూపించాడు. కేవలం గంటల వ్యవధి లోనే ఒక ద్విచక్ర వాహనాన్ని దొంగలించి అమ్మకానికి పెట్టడం సంచలనం గా మారి పోయింది. ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం వెలుగు లోకి వచ్చింది. కాశి బోయిన గణపతి ఇటీవల దొంగతనాలు చేస్తూ ఉన్నాడు.


 స్థానికుల ఫిర్యాదు మేరకు ఇటీవలే అతన్ని అరెస్టు చేశారు పోలీసులు. అయితే అక్కడ అతను చేతులకు బేడీలు వేసారు. ఇక బుధవారం రాత్రి సమయం లో పోలీసుల కళ్లు గప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. అంతలోనే కూసుమంచి మండలం నాయకన్ గూడెం సర్పంచ్ కుమారుడి వివాహ సందర్భం గా గ్రామంలో రద్దీ ఉండదని ఒక ద్విచక్ర వాహనాన్ని దొంగలించాడు.  వాహనాన్ని బేరం పెట్టేందుకు ప్రయత్నించాడు. ఇక వాహనం లేకపోవడాన్ని గమనించి అందరూ అప్రమత్తం కావడంతో చుట్టుపక్కల గాలించగా చివరికి దొంగ పట్టుబడ్డాడు. పోలీసులకు అప్పగించగా అతను పరారైన నిందితుడు అన్న విషయం వెల్లడైంది..

మరింత సమాచారం తెలుసుకోండి: