ఇటీవలి కాలంలో ఎక్కడచూసినా దొంగల బెడద ఎక్కువైపోతుంది అన్న విషయం తెలిసిందే. అది ఇది అని తేడా లేదు అన్నింటినీ దొంగలిస్తూ జనాలకు షాక్ ఇస్తున్నారు దొంగలు. ఇక దేవుడిని కూడా వదలడం లేదు అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఆలయంలోకి రహస్యంగా చొరబడి విలువైన వస్తువులు బంగారాన్ని దొంగలించడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక మరికొంత మంది దొంగలు కాస్త ధైర్యం చేసి ఏకంగా గుడిలో ఉండే హుండీ మొత్తాన్ని ఎత్తుకెళ్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే.


 ఇంకొంతమంది ఏకంగా దేవుడి విగ్రహాలనే దొంగలిస్తూ షాక్ ఇస్తున్నారు. ఇలా ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇక పక్కా ప్లాన్ ప్రకారం ఆలయ విగ్రహాలను చోరీ చేశారు నిందితులు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే తమకు పీడకలలు వస్తున్నాయని ఎంతో భయపడిపోయిన దొంగలు చోరీ చేసిన  విగ్రహాలను మళ్ళీ తిరిగి ఆలయ పూజారి ఇంటి సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. చిత్రకూట్ జిల్లా తరంహలోని పురాతన బాలాజీ ఆలయం నుంచి దాదాపు కోట్ల రూపాయల విలువైన 16 అష్టధాతు విగ్రహాలు చోరీకి గురయ్యాయి.


 దీనికి సంబంధించి ఆలయ పూజారి మహంత్  పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇక ఈ కేసు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే చోరీకి గురైన 16 విగ్రహాలలో 14 విగ్రహాలు అటు పూజారి మహంత్ ఇంటి సమీపంలో ఒక గోనెసంచిలో లభ్యం కావడం గమనార్హం. అంతేకాదండోయ్ ఇక ఆ సంచిలో ఒక లేఖ కూడా బయటపడింది. విగ్రహాలను చోరీ చేసిన తర్వాత రాత్రి పూట పీడకలలు వస్తున్నాయని అసలు నిద్ర పట్టడం లేదని అందుకే భయంతో తిరిగి ఇచ్చేస్తున్నట్లు లేఖలో రాసి ఉండటం గమనార్హం. ఇక ఈ విగ్రహాలను భద్ర పరిచామని నిందితులను పట్టుకునే దిశగా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి: