ఇటీవల కాలం లో  ఎక్కడ చూసినా దొంగల బెడద ఎక్కువై పోయింది అన్న విషయం తెలిసిందే. చిన్న ఉద్యోగం వ్యాపారం చేసుకుంటూ సభ్య సమాజం లో గౌరవం గా బతకడం కంటే దొంగతనాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. చివరికి జల్సాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో తాళం వేసి ఉన్న ఇల్లు కనిపించింది అంటే చాలు ఇక రహస్యం గా ఇంట్లోకి చొరబడి  ఇల్లు గుల్ల చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు దొంగలు. ఈ క్రమం లోనే నేటి రోజుల్లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు యజమానులు.


 పోలీసులు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేస్తున్నప్పటికీ  దొంగలు మాత్రం ఎంతో చాకచక్యం గా దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలం లో మాత్రం కొంత మంది దొంగలు మరింత వెరైటీగా సినిమాటిక్ రేంజ్ లో దొంగతనాలకు పాల్పడుతూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. సాధారణం గా ఎవరైనా దొంగలు చోరీలకు వెళ్తే  ప్లాన్ ప్రకారం విలువైన  వస్తువులు దోచుకొని వెళ్లి పోవడం లాంటివి చేస్తుంటారు. కానీ ఇక్కడ దొంగలు మాత్రం చాలా వెరైటీ దొంగతనానికి వెళ్లిన తర్వాత తీరిగ్గా కూర్చుని పూజలు చేస్తున్నారు. ఈ ఘటన కేరళ లో వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి. ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో చొరబడిన ఆగంతకులూ ఏకం గా 34 లక్షల విలువైన నగదు బంగారం కూడా ఎత్తుకెళ్లారు  ఇలా చోరీ చేయడానికి వెళ్లిన దొంగలు ఆ సంస్థలో లాకర్ వద్ద ప్రశాంతం గా కూర్చొని ఎన్నో రకాల ప్రార్థనలు చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఒక నోట్ కూడా అక్కడే వదిలేసి వెళ్ళి పోయారు. ఇక ఇందులో ఐ యాం  డేంజరస్ డోంట్ ఫాలో మీ అని వ్రాసి ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: