నేటి రోజుల్లో మంచి ఉద్యోగం మంచి జీతం  ఉన్నా కూడా ఎందుకొ మనిషి ప్రవర్తన తీరు మంచిగా ఉండటం లేదు. ఏకంగా సొంత వాళ్ల విషయంలోనే కర్కశంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే.  కట్టుకున్న భర్తలె నేటి రోజుల్లో భార్యలను వరకట్న వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు కోకొల్లలు అని చెప్పాలి. పెళ్లి చేసుకునే సమయంలో అత్తింటి వారు భారీగా కట్నం డబ్బులు ముట్టజెప్పినా కూడా పెళ్లయిన కొన్నాళ్లకే అదనపు కట్నం  కావాలంటూ వేధిస్తున్న భర్తలు ఎక్కువై పోతున్నారు. దీంతో ఇక కోటి ఆశలతో మెట్టినింట అడుగుపెట్టినా వారికి కొన్నాళ్లకే చిత్రహింసలు చూసే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి.


 ఇలా అదనపు కట్నం వేధింపులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎంతోమంది చివరికి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎంతోమంది తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చి స్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. పుట్టింటి నుంచి డబ్బులు తేవాలి అని భార్యని వేధించడం మొదలు పెట్టాడు భర్త. అయితే పుట్టింటి వారిని  ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక భర్త చెప్పిన దానికి ఒప్పుకోలేదు ఆమె. దీంతో చివరికి భార్యను హతమార్చాడు. ఈ ఘటన బెంగళూరు లోని హాసన్ తాలూకా దొడ్డమండిగహళ్లిలో వెలుగులోకి వచ్చింది.



 మంజునాథ అనే వ్యక్తి ఆటోమొబైల్స్ సంస్థలో పని చేస్తున్నాడు. అతనికి నెలకు ఎనభై వేల రూపాయల జీతం వస్తుంది. కానీ వచ్చినా దాంతో సరిపెట్టుకోకుండా ఇక క్రికెట్ బెట్టింగ్ కు బానిస గా మారిపోయాడు. చివరికి అంత పోగొట్టుకున్నాడు. దాంతో సరిపోలేదు అన్నట్టుగా పుట్టింటికి వెళ్ళి డబ్బు తీసుకురావాలంటు భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయంపై ఎన్నో సార్లు పంచాయితీ జరిగగా.. ఇక పెద్దలు రాజి కుదుర్చారు. ఇక ఆ తర్వాత కాలంలో భార్య తేజస్విని కూడా చిన్న ఉద్యోగానికి పంపడం మొదలుపెట్టాడు. ఇక చివరికి భార్యపై అనుమానం పెంచుకునీ  ఇటీవలే ఆమె తో గొడవపడి బండరాయితో కొట్టి చంపాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు భర్త మంజునాథ్ తో పాటు అతని తల్లిదండ్రులను అరెస్టు చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: