కరోనా వైరస్ కారణంగా అటు విద్యా వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది అన్న విషయం తెలిసిందే. విద్యావ్యవస్థలో టీచర్లుగా లెక్చరర్లుగా కొనసాగుతున్న ఎంతోమంది జీవితం దుర్భరంగా మారిపోయింది. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా ఎన్నో నెలల పాటు విద్యా సంస్థలు మూత పడిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక ప్రైవేటు విద్యా సంస్థలు తమ టీచర్ల గురించి అస్సలు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే అప్పటి వరకూ ఎంతో మంది విద్యార్థులకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు చివరికి రోజువారి కూలీలుగా మారిపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. కరోనా కారణంగా మరోసారి రిస్క్ చేసే ఉద్దేశం లేకుండా కుటుంబం కోసం వేరే వృత్తిలో సెటిల్ అయిపోతున్నారు ఒకప్పటి టీచర్లు.


 అయితే మొన్నటి వరకు కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్థలు మూతపద్దాయ్.  ఎప్పుడు తెరుచుకుంటాయి ఎప్పుడు మూత పడతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు కరోనా వైరస్ పరిస్థితి సద్దుమణుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక అన్ని రకాల విద్యా సంస్థలు తెరుచుకుంటున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అన్ని కళాశాలల్లో లెక్చరర్ కొరత ఏర్పడుతుంది అన్నది తెలుస్తుంది.  ఈ క్రమంలోనే ప్రస్తుతం కొన్ని విద్యాసంస్థలు వినూత్నమైన ప్లాన్ అమలులోకి తీసుకు వస్తున్నాయ్. ఈ విద్యాసంవత్సరం అనుబంధ గుర్తింపు పొందేందుకు ఇంజనీరింగ్ కళాశాలలో ఉత్తుత్తి అధ్యాపకుల కోసం మళ్లీ వేట కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది.


 ఈ క్రమంలోనే అలాంటి వారిని గుర్తించి రప్పించే పనిలో పడ్డారట. కొన్ని కళాశాల యాజమాన్యాలు అయితే ఏకంగా ఈ పని ఏజెన్సీలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక రోజూ ఉదయం సాయంత్రం బయోమెట్రిక్ హాజరు వేసి వెళితే నెలకి 15000 రూపాయలు ఇస్తామని కొన్ని కళాశాలల యాజమాన్యాలు  ఒప్పందం కూడా కుదుర్చుకుంటు ఉన్నాయట. ఈ క్రమంలోనే బాచుపల్లిలోని ఒక కళాశాల జెఎన్టియు పరిధిలోని ఒక కళాశాలల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయట. కాగా జేఎన్టీయూహెచ్ తనిఖీలను వస్తే దాదాపు 20వేల రూపాయలు ముట్టచెబుతామని కన్సల్టెన్సీ  ఏజెన్సీలు బేరాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: